Thursday 15 December 2011

జామకాయ తినాలంటే!

ముందుగా నాణ్యమైన జామ మొక్కను ఎంచుకోవాలి!

మొక్కకు ఎలాంటి లోటు రాకుండా పోషణ చేయాలి!

మొక్కకాస్తా బలంగా పెరిగి చెట్టులా మారుతుంది!

ఇలా పూతపూసి కాయలు కాయడానికి సిధ్దమౌతుంది!

ఒళ్ళంతా కాయలు చేసుకుని విరగకాస్తుంది!

కాయలు పక్వానికి వచ్చాయని చిలకమ్మ ఇలా కొరికి చెబుతుంది!

మనం ఆమ్..ఆమ్మని తినెయ్యాలీ...!

8 comments:

  1. హహహ! అలాగా? కాని నాకు ఇలా పండిన పళ్ళు ఇష్టం లేదుగా! దోరగా ఉంటేనే రుచి!

    ReplyDelete
  2. జామకాయ తినాలంటే ఇవన్నీ ఎందుకండీ..మీ ఇంటికి వస్తే సరిపోతుందిగా..తోటనుండి చిలుకమ్మ చేతిలో కాయదాకా అన్నీ చక్కగా చూపించారు.

    ReplyDelete
  3. బాలూ గారూ జామ కాయ అలా తినాలా? భలే చెప్పారు. :)

    ReplyDelete
  4. @ కొత్తపాళీగార్కి కృతజ్ఞతలు
    @ రసజ్ఞ ఆంటీ! నాకు పళ్ళు లేవుగా మీలా దోరజాంకాయ తినలేను.(రసజ్ఞగారు ఇది నా తమ్ముడు కూతురు 'అమ్ము' కామెంట్.)
    @ జ్యోతిర్మయిగారూ! భయపడ్డారు కదా, నాబ్లాగు కి ఇప్పుడప్పుడే రారేమో అనుకున్నాను.కృతజ్ఞతలతో మీకో దోరజామపండు.
    @ సుభగారూ! నాకు తోచిన పద్దతిలో చెప్పానండి. మీకు నచ్చింనందుకు సంతోషం.

    ReplyDelete
  5. బాగుంది మీరు చెప్పిన పద్ధతి. సరేనండి అంటే నేను జామకాయ తినాలంటే మీ తోటకి రావాలి లేదా ఇప్పుడు చెట్టు నాటి వచ్చే సంవత్సరం కాపు కాసినప్పుడు తినాలి ఎంటో ఇంకా నయం కొనుక్కుందాం అనుకుంటున్నాను.

    ReplyDelete
  6. బాలు గారు,

    నాక్కూడా ఒక జామకాయి అట్టే పెట్టండి..పాలకొల్లు వస్తున్నా అప్పుడు తీసుకుంటా...

    ReplyDelete
  7. @ మీనుగారు! ఇది 30 రోజుల్లో హిందీ లాంటి ఫార్ములాలాంటిదండి.
    @ raf raafsun గారూ! మీరు అడగాలటండీ.బ్లాగరులందరికోసం దాచిపెట్టానులెండి.

    ReplyDelete