Friday, 30 December 2011

నక్కబావకు కొత్త సంవత్సరం కిక్

అనగనగనగా ఒక నక్క, ఒక కొంగ. ఆ రెండిటి మధ్య చిన్నపాటి స్నేహం వుంది. కొంగ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకపోయినా నక్క మనసులో మాత్రం అప్పుడప్పుడు దాని జిత్తులమారి లక్షణాలు బయటపడేవి. 

ఒక రోజు కొంగ, నక్క బార్ లో కూర్చుని మందు కొడుతున్నాయి. వాళ్ళ ఒప్పందం ప్రకారం ఆరోజు బార్ లో బిల్లు నక్క కట్టాలి.కాని మధ్యలో దానికో దురాలోచన పుట్టింది. కొంగ చేత కొంచెం ఎక్కువ మందు కొట్టించి, మత్తు తలకెక్కాక సెంటిమెంట్ టచ్ ఇచ్చి ఆరోజు బిల్లు కూడా కొంగ చేతే కట్టించాలని అనుకుంది.ఈ విషయాన్ని గమనించిన కొంగ అతిగా తాగకుండా జాగ్రత్త పడుతూ, ఆవిషయం నక్కకు తెలియకుండా నక్క చేతే ఎక్కువగా తాగించింది. 

దానికి మత్తు తలకెక్కాక " నక్కబావా! నక్కబావా! మనిద్దరి స్నేహం చిరకాలం ఇలాగే వుండాలంటే నాదో చిన్న కోరిక. నువ్వు కాదనకూడదు" అంది.
"హె! నీమాట కాదనడమా. నెవర్. ఆ కోరికేంటో చెప్పు కొంగబావా!" అంది మాటలు తడబడుతూ.
"మనం ప్రతిరోజు ఇలాగే, ఈ బార్ లోనే ఫుల్లుగా మందు కొట్టాలి. ఈ సంవత్సరమంతా ఆ బిల్లు నేనే కట్టాలి"
నక్క ఒక్కసారిగా టేబుల పై నుండి కింద పడిపోయింది. 'ఇదేంటిది ఇవాలొక్కరోజు దాని చేత  బిల్లు కట్టించాలని నేను ప్లాన్ వేస్తే మొత్తం సంవత్సరమంతా కట్టేత్తానంటాదేంటి..ఇంతకన్నా ఏం కావాలి. సంవత్సరం పాటు మనకి మందు ఫ్రీ!' అని సంతోషపడి.
"కొంగ బావా! మన స్నేహానికి ఇంత పెద్ద గిప్ట్ ఇస్తావని మత్తులో కూడా ఊహించలేదు. అయితే నాది కూడా ఒక చిన్న కోరిక"
"ఏంటది నక్కబావా?"
"ఈ సంవత్సరం బిల్లంతా నువ్వు కట్టి నీ స్నేహాన్ని నిరూపించుకున్నావ్. వచ్చే సంవత్సరం బిల్లు మొత్తం  నన్ను కట్టనిచ్చి నాస్నేహాన్ని నిరూపించుకోనియ్" అని అంది.
"అలాగే అంతకన్నానా. పద"

రెండూ కలసి క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాయి.

"ఇదిగో బాబు! ఈ క్రెడిట్ కార్డ్ నుంచి వచ్చే సంవత్సరానికి మా ఇద్దరికి మందు ఖర్చు ఎంతవుతుందో అంత ఇప్పుడే గీకేసుకో..టిప్పుతో సహా" అని క్రెడిట్ కార్డ్ ఇచ్చింది నక్క.
"అన్-లిమిటెడ్ ప్యాక్ తీస్కోండి సార్. టిప్పుతో కలిసి రెండు లక్షలు అవుతుంది. మీకు మందు ఎక్కువై పడిపోయినా మేమే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం" అన్నాడు కౌంటర్ అబ్బాయి.
"అలాగే కానియ్" అంది నక్క. 
ఇప్పుడు కొంగ "ఇదిగో బాబు రెండు వేలు. ఈ సంవత్సరం మొత్తానికి నేను కడుతున్న బిల్లు" అంటు క్యాష్ తీసిచ్చింది.
నక్క షాక్ తిని..
"అదేంటి బావా! నాకు సంవత్సరం బిల్లు రెండు లక్షలేంటి. నీకు రెండువేలేంటి?" అంది ఆశ్చర్యంగా.
"ఈరోజు డిసెంబర్ 31 బావా. నేను కట్టాల్సిన సంవత్సరం ఈ రోజుతో ఐపోయింది" అని కళ్ళు చిట్లించింది.
నక్కబావ కొత్త సంవత్సరం కిక్  కి తట్టుకోలేక కిందపడిపోయింది. కొంగ నెక్స్ట్ ఇయర్ అకౌంట్ లో ఒక ఫుల్ బాటిల్ తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.

....బ్లాగరులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు....

14 comments:

 1. mamdukaburlu bale cepperu. ratriki mamdu kodadaamaa bill naadE.

  ReplyDelete
 2. @ శర్మగారూ! మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు, కాని నేను మీకు కంపెనీ ఇవ్వలేనండి.
  @ గీతా_యశస్విగారూ! మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  @ రాజీగారూ! మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. ఊసుల........ నూతన సమవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 4. కష్టేఫలే గారు! చాలా సంతోషం. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 5. బాలు గారూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 6. మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రసజ్ఞగారూ!

  ReplyDelete
 7. బాలూ గారూ నిన్ననే కామెంటుదామనుకున్నా.. మత్తులో ఉండి ఉంటారు.. డిస్ట్రబ్ చేయడమెందుకని. ;) మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

  ReplyDelete
 8. @ సుభగారూ! ఎంతమాట అనేసారండి. మందు టాపిక్ తో టపా రాసినంతమాత్రాన మత్తు లో ఉన్నట్టాండి.నాకు కొత్త సంవత్సరంలో ఇదో రకమైన కిక్కిచ్చే కామెంటండి.

  ReplyDelete
 9. గురు గారు,,

  నూతన సంవత్సర సుభాకంక్షలండి.......

  ReplyDelete
 10. బ్లాగ్ మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! :)

  ReplyDelete
 11. @ raf raafsun గారు! కృతజ్ఞతలండీ! మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  @ నందు గారూ! మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఊసులతీరం కు స్వాగతం.

  ReplyDelete
 12. malli pichekkinchesav...adirindi..

  ReplyDelete