Friday, 28 December 2012

ఆంగ్లపదాలకు తెలుగు సమానార్థకాలు-1



మద్యశాఖ భటులు    అబ్కారీ కానిస్టేబుళ్ళు
సాంకేతిక పట్టా   బీటెక్
సాంకేతిక స్నాతకోత్తర పట్టా    ఎంటెక్
వ్యాపార నిర్వహణ స్నాతకోత్తర పట్టా  -  ఎంబిఏ
ఔషదశాస్త్ర స్నాతకోత్తర పట్టా    ఎంఫార్మసీ
ఉన్నత మాధ్యమిక విద్య    ఇంటర్మీడియట్
యంత్ర నిర్వహన విద్య   మెకానికల్ ఇంజనీరింగ్
సమాచార సాంకేతిక విద్య    ఐటీ
ధనాగారాలు    బ్యాంకులు
భారతీయ సమాచార నిర్వహణ సంస్థ బీఎస్ ఎన్ ఎల్
ప్రాధికార సంస్థలు కార్పొరేషన్స్
స్నాతకోత్తర పట్టబద్రుడు పోస్ట్ గ్రాడ్యుయేట్
యంత్రవిద్య – ఇంజినీరింగు


(సేకరణ : ఈనాడు)

*తెలుగు పై ఉన్న ఇష్టంతో చదివి, విని, చూసి తెలుసుకున్న విషయాలను  ఒకచోట పొందుపరిచే చిరుప్రయత్నం.

Saturday, 17 November 2012

అమావాస్య ముందురోజు



     అమావాస్య ముందురోజు...అర్ధరాత్రి...11 గంటల సమయం...దెయ్యాలు తిరుగుతాయని అందరూ చెప్పుకునే ‘నక్కలకాలవ’ వంతెనపై...ఒంటరిగా సైకిల్ పై వెళ్తుంటే ఎలా ఉంటుంది...ఒక్కసారి ఊహించుకోండి..ఆ ఊహ నిజమై నాకు ఎదురైన అనుభవాన్ని బ్లాగు మిత్రులందరితో పంచుకుంటానని ఎప్పుడో మాటిచ్చాను. ఇప్పటికి ఆ మాటను నెరవేర్చుకుంటున్నాను. ఇక చదవండి..!
          ఆచంట నుంచి పెనాదం (పెనుమదం) రావాలంటే  యేమారం (వేమవరం) చెరువు మలుపు దాటి కిలోమీటరు దూరం ఎల్లాక ఇంకో చిన్న మలుపు తిరగ్గానే సిమ్మెంట్ సైడ్ లతో మనకి కనిపిస్తుంది ‘నక్కలకాల్వ వంతెన’. అక్కడ దట్టమైన పొదలు తప్ప ఇళ్ళుగానీ, మనుషులుగానీ ఉండరు. కానీ ఆ చుట్టుపక్కల ఎవరు చనిపోయినా అక్కడికే తీసుకొస్తారు.
           అమాస చీకట్లో ఆచంట నుంచి పెనాదం ఒక్కడినే సైకిల్ మీద వస్తున్నాను. యేమారం దాటేసరికే టైమ్ రాత్రి పదకొండు దాటింది. కటిక చీకటి. ఆరోడ్డులో లైట్లు లేవు. రోడ్డుకూడా బాగా పాడైపోయింది. లూజైపోయిన నా సైకిల్ కేరేజ్ సౌండ్ తప్ప ఆ నిశ్శబ్దంలో మరేమీ వినిపించడంలేదు. ఇంకో రెండు నిమిషాల్లో నక్కలకాల్వ చేరుకుంటాననగా ఎవరో జనం వస్తున్న అలికిడి వినిపించింది. నేను సైకిల్ ని కొంచెం స్లో చేసి చీకట్లో ఆ వచ్చేవారిని గుద్దకుండా జాగర్తగా పక్కనుండి వచ్చే ప్రయత్నం చేస్తుంటే... తడిబట్టలతో, అప్పుడే స్నానాలుచేసి వస్తున్నట్టుగా ఇరవైమంది వరకు నాకు ఎదురొచ్చి నన్ను దాటుకుంటూ వెళ్ళారు. ‘హమ్మయ్య ఈ టైంలో ఏదో కొంత మనిషి అలికిడిలే’ అనుకుంటుండగా...
“ఇంటి సూర్లో దాచిన ఎండ్రిన్ బాటిల్ తీసుకుని మొత్తం తాగేసి చచ్చిపోయేదాకా ఎవ్వరూ చూడ్లేదురా..గాచ్చారం కాకపోతేనూ..” ఆ జనంలోంచి ఎవరో పెద్దాయన అంటున్న మాట నాకు వినిపించింది. అప్పుడుగాని నాకు అసలు విషయం అర్ధంకాలేదు. వెంటనే నక్కలకాల్వ దగ్గర అంతకు ముందు వరకు ఏం జరిగి ఉంటుందో నేను ఊహించాను.
          ఎవరో ఒకతను ఎండ్రిన్ తాగి చనిపోయాడు. అతనికి కాల్వ పక్కన ఉండే చిన్నపాటి స్మశానంలో అంత్యక్రియలు చేసి వీళ్ళందరూ అక్కడ్నించి వస్తున్నారు. చీకట్లో తిరగడాలు, స్మశానం పక్కనుంచి అంత రాత్రి వేళల్లో ప్రయాణం చేయడాలు నాకు కొత్తకాదు కాబట్టి భయం కలగకపోయినా సహజంగానే మనసులో ఏదో చిన్న అలజడి. పైగా అది అందరూ దయ్యాలుంటాయని చెప్పుకునే ‘నక్కలకాల్వ’.

          “ముందు చెప్పిన మలుపు దాటి నేను ప్రస్తుతం నక్కలకాల్వ వంతెన పై ఉన్నాను. సిమెంటు వంతెన ఎక్కగానే ఒక్కసారిగా నా ముఖం పై ఏదో మంటలతాలూకు వెలుగు పడింది. ఇంతక్రితం వెళ్ళిన జనం డొంకల చాటున చితిని అంటించి అది పూర్తిగా ఆరకుండానే వదిలేసి వెళ్ళిపోయారు. దాని తాలూకా ఆనవాళ్ళు ఆ మంటలు. ఆ విషయం తెలిసాక నాకు భయం తీవ్రత పెరగలేదు కానీ పెరిగే ప్రయత్నం లోపల జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఆ వాతావరణం లక్షణం అదేకదా! వంతెన దాటేస్తే సగం గుబులు పోతుంది. ఎందుకంటే ఏం జరిగినా వంతెనపైనే జరుగుతుందని గతంలో అందరూ చెప్పుకునే అనుభవాలు.  ధైర్యం తెచ్చుకుని సైకిల్ కొంచెం స్పీడ్ గా తొక్కాను. అదే చిమ్మచీకటి..అదే నిశ్శబ్దం..అదే ఒంటరి ప్రయాణం... వంతెన దాటేసాను....మనసులో ‘హమ్మయ్య’ అనుకుంటుంటే భయం కిందికి జారిపోయినట్టుగా అనిపిస్తుండగా ఒక్కసారిగా “కిర్ర్..ర్ర్..ర్ర్..ర్ర్..కుర్..కిర్..కిర్...” అని విక్రుతమైన, అర్ధంకాని అరుపు..ఒక్కసారిగా ఆ అరుపుకి నిశ్శబ్ధంగా ఉన్న పరిసరాలన్నీ దద్దరిల్లిపోయాయి. ఆ అరుపు కి ఒంట్లో రక్తం ఒక్కసారిగా ‘ఝమ్మని’ మెదడుకి పోటెత్తిన ఫీలింగ్. అప్పుడు కలిగింది అసలైన భయం. క్షణకాలంలో ఆ అరుపు ‘గుడ్లగూబ’ అరుపు అని గుర్తించి కాసేపటికి భయం నుండి తేరుకున్నాను. సైకిల్ తొక్కడం ఆపలేదు. ఆటైం లో నన్ను అంతగా భయపెట్టిన గుడ్లగూబను ‘బండబూతులు’ తిట్టుకుంటూ చీకట్లో ప్రయాణం కొనసాగించాను.
     ఆ తర్వాత ఆ రూట్లో చాలాసార్లు రాత్రిపూట ప్రయాణం చేసాను..కానీ ప్రతిసారీ ‘గుడ్లగూబ అరవొచ్చు’ అని మనసులో ముందే ఫిక్సయ్యేవాడిని.

గతంలో నేను రాసిన ‘నక్కలకాల్వ మొదటి టపా’ కోసం ఇక్కడ ఇచ్చిన ముడిని నొక్కండి..

Friday, 9 November 2012

జెఠ్మలాని చెత్తవాగుడు


“అకారణంగా సీతను అడవికి పంపిన రాముడిని నేను ఆరాధించను..” – జెఠ్మలాని! 
"నీలాంటి వాళ్ళు ఆరాధింకపోతే  ఏంటట నష్టం?"

       జెఠ్మలానిలాంటి వాళ్ళు తమ స్వార్ధంకోసం చేసే రాద్ధాంతాల వలన  ధర్మానికి  అధర్మం అనే ఎంగిలి అంటుకోదు. ధర్మదేవత కోటు వేసుకుని నోట్లకోసం అవినీతి అధినేతల తరపున వకాల్తా పుచ్చుకుని వాదించే ఇలాంటి వారికి నిజమైన ‘ధర్మకోణం’ ఎప్పటికీ రుచించదు, అసలు కనిపించదు కూడా.

     అసలు ఈయన్ని రాముని గురించి నమ్మమని, ఆరాధించమని ఇప్పుడు ఎవరు బలవంతం చేసారు. ఈయనకి ప్రపంచంలో ఉన్న అధ్యాత్మిక పురుషులందరు పైన నమ్మకం ఉండి ఒక్క రాముని పైనే నమ్మకంలేదా?  అలా అయితే ఆయన అభిప్రాయాన్ని ఆయన వద్దే ఉంచుకోవాలి.ఇలా మరొకరి మనోభావాలపై బురదచల్లి తన దురద తీర్చుకోవడం ఎందుకు. ఈ విశాల భారతావనిలో  ఎవరికివారు తమకు నచ్చిన ధర్మాన్ని ఆరాధిస్తూ సామాజిక జీవనం సాగిస్తున్నారు. అంతమాత్రాన ఎవరికి వారు ఇలా నోరుపారేసుకుంటే ఎలా ఉంటుందో ఈ మేధావికి తెలియని విషయం అనుకోవాల? ఇలాంటి వ్యాఖ్యలే మరెవరిమీదైనా  చేసుంటే ఈపాటికి ఈయన  పరిస్తితి ఎలా ఉండేదో జెఠ్మలానికి బాగా తెలుసు. అందుకే అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇలాంటి వాళ్ళు భయపడతారు. 

      పురవీధిలో దేవుని పల్లకి బయల్దేరుతుంటే మంగళవాయిద్యాలు ఒక్కసారిగా మోగుతాయి. అదివిన్న జనానికి భక్తిభావం ఉప్పొంగుతుంది. అదే సమయంలో ఆ వీధిలో ఉండే కుక్కలు ఉలిక్కిపడి మొరగడం ప్రారంభిస్తాయి. అంతమాత్రాన వాటి పరపతి పెరగదు, స్వామివారి పరపతి తగ్గదు. 

Saturday, 1 September 2012

హీరో సూర్య సందేశం


హీరో సూర్య పేరు మీద  ఇటీవల ముఖసంకలనం (Face Book) లో కనిపించిన సందేశం ఇది. ఎవరికైనా ఉపయోగపడొచ్చు. నచ్చితే నలుగురుతో పంచుకోండి.

Thursday, 2 August 2012

నల్లని మేఘం కూడా నల్లధనంలా అయిపోయింది


ఆకాశానికి దాహం ఎక్కువ
సూర్యకిరణాలను స్ట్రాలు గా చేసి
నేలపై నీటిని అందినకాడికి తాగేసింది.

ఆకాశం తాను తాగిన నీటిని మేఘంలో దాచిపెట్టింది
మేఘం స్విస్ బ్యాంక్ అవతారమెత్తింది
అది మనల్ని ఊరిస్తుందికాని ఊడి చుక్క పడనివ్వదు.

నల్లని మేఘం కూడా నల్లధనంలా అయిపోయింది.

Tuesday, 24 July 2012

కాన్సర్ కి మందు

 
 నా ఇన్-బాక్స్ కి వచ్చిన ఒక మెయిల్ సారాశం ఇది. ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దీనికి సంబందించిన మరింత సమాచారం ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో తెలియచేయండి.
 

ls Circulate to as many as you can. Medicine for Blood Cancer!!!
 
 
 




Dear All,

Medicine for Blood Cancer (Leukemia)!!!!

Please don't delete this without forwarding.
I am forwarding it to the maximum I can.

Let it reach the 110 crores Indians and the remaining if any.

'Imitinef Mercilet' is a medicine which cures blood cancer. Its available free of cost at "Adyar Cancer Institute in Chennai".
Create Awareness. It might help someone.

Forward to as many as u can, kindness costs nothing.
Cancer Institute in Adyar, Chennai

Category:            Cancer
Address:             East Canal Bank Road , Gandhi Nagar
                             Adyar
                             Chennai -600020
                             Landmark: Near Michael School
                             Phone: 044-24910754 044-24910754 , 044-24911526 044-24911526 , 044-22350241 044-2235024


Wednesday, 6 June 2012

మియ్యావ్..మియ్యావ్ పిల్లీ!

డార్లింగ్! కబుర్లు చాలు కాసేపు పడుకుంటాను.

నాగురించి ఎవరైనా వచ్చినా డిస్టర్బ్ చెయ్యకు.

అయ్యో! సరిగ్గా నిద్రపట్టట్లేదు. కొంచెం జోల పాడూ..!

గుర్ర్..ర్ర్..ర్ర్..ర్ర్..

Tuesday, 22 May 2012

దోమా! నీకు అవసరమా ప్రేమ?

అనగనగా ఒక దోమ
దాని పక్క పోర్షన్ లో ఒక  అందమైన చీమ
చీమంటే దోమకు వల్లమాలిన ప్రేమ
దాని దృష్టిలో పడటానికి పడింది ఎంతో శ్రమ
ఎప్పటికైనా చీమ ప్రేమను పొందగలనని దానికి ధీమా
చీమ నుండి మాత్రం స్పందన లేదు సుమా.
చివరకు దోమ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆడింది డ్రామా

అది తెలిసి చలించిపోయింది చీమ
దాని ప్రేమకు ఐపోయింది ఖీమా
దోమతో అంది 'నువ్వే నా భామ'
ఆ ఆనందంతో గట్టిగా కుట్టింది దోమ
ఆ దెబ్బకు చీమకు మిగిలింది కోమా
ఇంక చీమ తిరిగొస్తుంది అనుకోవడం దాని భ్రమ.

Sunday, 20 May 2012

ఔరా అనిపించే విషయాలు.

 ఔరా అనిపించే విషయాలు..           
                                       
1. 
జిరాఫీ రోజులో సగటున రెండు గంటలకు మించి నిద్రపోదు.

2. డాల్పిన్స్ లో కొన్నింటికి 250 వరకు దంతాలు వుంటాయట.

3. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం డైనోసార్ లలో పెద్దవి 80,000 కేజీల నుండి 1,00,000 కేజీల వరకు బరువు ఉండవచ్చట.

4. సీతాకోకచిలుకలలో మగ సీతాకోకచిలుకలు తమ ప్రేయసిని 8 కిలోమీటర్ల దూరం నుండి వాసన ద్వారా గుర్తించి చేరుకుంటాయి.

5. తల్లి పెంగ్విన్ తన పిల్లను కోల్పోయిన సందర్భాలలో వేరే పెంగ్విన్ ల పిల్లలను దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది. 

6. తుమ్ము వచ్చినపుడు మనం కళ్ళను తెరిచి వుంచడం అసాధ్యం.
7. మన కళ్ళకు 10 మిలియన్ల రంగులను గుర్తించగలిగే సామర్ధ్యం ఉంటుందట.

8. 'మోనార్క్' అంటే చక్రవర్తి లేదా శ్రేష్టుడు అని అర్ధం.

9. ఇప్పటివరకు వర్షం అంటూ కురవని పట్టణం ప్రపంచంలో ఒకటుంది. దాని పేరు "Calama". ఇది చిలీ లో వుంది.


 10. ఒక ఎలుకల జంట సంవత్సరంలో 15000 పిల్ల ఎలుకలకు జన్మనిస్తాయి.

Monday, 30 April 2012

Friday, 2 March 2012

పిచ్చుక పై సెల్ అస్త్రం

బయటకెళ్ళాలంటే ఏ సెల్ టవర్ సిగ్నల్ కి బలైపోతానోనని భయంగావుంది.

Thursday, 1 March 2012

చెట్టుకు పండిన బొప్పాయి

ఇప్పుడు అందరూ దీన్ని బొప్పాయి బొప్పాయి అంటున్నారుగానీ, మేము మాత్రం ముద్దుగా బొబ్బాసపండు అనేవాళ్ళం.

Thursday, 23 February 2012

ప్రయాణం కాదు ప్రమాదం

ఒక మిత్రుడు పంపించిన ఫోటో ఇది. ఏదో రకంగా ప్రయాణం చేస్తున్నాం, గమ్యాన్ని చేరుకుంటున్నాం అని అనుకోవచ్చు గాని ప్రమాదాలనేవి చెప్పిరావు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదైనా అనుకోని కారణాల వలన పట్టు తప్పితే పరిస్తితి ఏంటో ఆలోచించండి. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలకు ఎక్కువశాతం మనమే కారణం అని ఇలాంటివి చూస్తే ఇట్టే చెప్పొచ్చు.
ప్రైవేటు ఆటోల్లో లెక్కకు మించి ప్రయాణికులను చేరవేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు, చలానాలు రాస్తారు. మరి ప్రభుత్వ రవాణాలో జరిగే ఇలాంటి వాటిని ఎవరు అదుపుచెయ్యాలి?

Thursday, 16 February 2012

ఆవిడ ఏం చెబుతుంది..ఈవిడ ఏం వింటుంది?

 మొన్నామధ్య అదేదో పోలీస్ స్టేషన్ లో నా మీద ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి జనాన్ని పోగేసుకుని వెళ్ళారంట. కారణమేమిటా అని వాకబు చేస్తే 'ఊసులతీరం' లో నేను సరిగ్గా టపాలు రాయడంలేదని, బ్లాగురాజు కల్లోకి వచ్చి హెచ్చరించినప్పటికి నేను నా పద్దతి మార్చుకోలేదనేది ప్రధాన అభియోగం.
పరిస్థితి ఇంత తీవ్రస్థాయికి వెళ్లడానికి నేనే కారణం. చెన్నై మెరీనా బీచ్ లో ఒక విచిత్రం జరగబోతుందని నాకు ఉప్పందింది. దానిని నా కెమేరాలో బంధించాలని హైదరాబాద్ లో మాయమై చెన్నై మెరీనా బీచ్ లో ప్రత్యక్షమయ్యాను. అనుకున్నది సాధించాను. అందుకోసమే ఇటీవల నా 'ఊసులతీరం' బోసిపోయింది, బ్లాగరులకు కోపమొచ్చింది, మేటర్ సీరియస్ అయ్యింది, కేస్ స్టేషన్ వరకు వెళ్ళింది.
ఇంతకీ మెరీనా బీచ్ లో నేను కెమెరాలో బంధించిన ఆ అద్భుతం ఏమిటనుకుంటున్నారా?
 "ప్రాణం లేని విగ్రహం, ప్రాణం ఉన్న కాకి తెగ మాట్లాడేసుకుంటున్నాయ్". నమ్మకం లేదా? అయితే కింద వున్న ఫోటోలు చూడండి..
 
ఆవిడ ఏం చెబుతుంది..ఈవిడ ఏం వింటుంది?

Tuesday, 14 February 2012

హచ్ గర్ల్ రాకకోసం బొచ్చుబాయ్ వైటింగ్

వేలంటైన్స్ డే కి ఇటుకలతో ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాను!
నా ప్రేయసి నా దగ్గరకి వస్తుందా? రాదా?

బొచ్చు కుక్కపిల్లలా ఎంత ఎదురుచూసినా హచ్ పిల్ల రాదే?

Tuesday, 31 January 2012

ఆకుల చాటున మాటువేసావ్

ఆకుల చాటున మాటువేసావ్ ఎందుకమ్మా మామిడి?

Monday, 30 January 2012

హలో...ఎవరండీ పైనా?

హలో...నేను కొబ్బరి గొడుగు కింద నుంచి మాట్లాడుతున్నాను! ఎవరండీ పైనా?