Sunday 20 May 2012

ఔరా అనిపించే విషయాలు.

 ఔరా అనిపించే విషయాలు..           
                                       
1. 
జిరాఫీ రోజులో సగటున రెండు గంటలకు మించి నిద్రపోదు.

2. డాల్పిన్స్ లో కొన్నింటికి 250 వరకు దంతాలు వుంటాయట.

3. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం డైనోసార్ లలో పెద్దవి 80,000 కేజీల నుండి 1,00,000 కేజీల వరకు బరువు ఉండవచ్చట.

4. సీతాకోకచిలుకలలో మగ సీతాకోకచిలుకలు తమ ప్రేయసిని 8 కిలోమీటర్ల దూరం నుండి వాసన ద్వారా గుర్తించి చేరుకుంటాయి.

5. తల్లి పెంగ్విన్ తన పిల్లను కోల్పోయిన సందర్భాలలో వేరే పెంగ్విన్ ల పిల్లలను దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది. 

6. తుమ్ము వచ్చినపుడు మనం కళ్ళను తెరిచి వుంచడం అసాధ్యం.
7. మన కళ్ళకు 10 మిలియన్ల రంగులను గుర్తించగలిగే సామర్ధ్యం ఉంటుందట.

8. 'మోనార్క్' అంటే చక్రవర్తి లేదా శ్రేష్టుడు అని అర్ధం.

9. ఇప్పటివరకు వర్షం అంటూ కురవని పట్టణం ప్రపంచంలో ఒకటుంది. దాని పేరు "Calama". ఇది చిలీ లో వుంది.


 10. ఒక ఎలుకల జంట సంవత్సరంలో 15000 పిల్ల ఎలుకలకు జన్మనిస్తాయి.

3 comments:

  1. బాగున్నాయండీ! ఎలుక అంటే నాకొకటి గుర్తొచ్చింది. నార్త్ అమెరికాలో కేకులన్నీ ఎక్కువగా ఎలుక లేదా చుంచు పాలతో చేస్తారు.

    ReplyDelete
  2. సీతాకోక చిలుకగా పుట్టలేదే!

    ReplyDelete
  3. @ రసజ్ఞగారూ!నార్త్ అమెరికాలో కేకులన్నీ ఎక్కువగా ఎలుక లేదా చుంచు పాలతో చేస్తారని చెప్పి మరో 'ఔరా' అనిపించే విషయం తెలియజేసారు.
    @ కస్టేఫలేగారూ! మీ ఆలోచన బాగుందండి. కానీ మగ సీతాకోకచిలుకో ఆడ సీతాకోకచిలుకో చెప్పనేలేదు.వ్యాఖ్యలు పెట్టినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete