Thursday, 16 February 2012

ఆవిడ ఏం చెబుతుంది..ఈవిడ ఏం వింటుంది?

 మొన్నామధ్య అదేదో పోలీస్ స్టేషన్ లో నా మీద ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి జనాన్ని పోగేసుకుని వెళ్ళారంట. కారణమేమిటా అని వాకబు చేస్తే 'ఊసులతీరం' లో నేను సరిగ్గా టపాలు రాయడంలేదని, బ్లాగురాజు కల్లోకి వచ్చి హెచ్చరించినప్పటికి నేను నా పద్దతి మార్చుకోలేదనేది ప్రధాన అభియోగం.
పరిస్థితి ఇంత తీవ్రస్థాయికి వెళ్లడానికి నేనే కారణం. చెన్నై మెరీనా బీచ్ లో ఒక విచిత్రం జరగబోతుందని నాకు ఉప్పందింది. దానిని నా కెమేరాలో బంధించాలని హైదరాబాద్ లో మాయమై చెన్నై మెరీనా బీచ్ లో ప్రత్యక్షమయ్యాను. అనుకున్నది సాధించాను. అందుకోసమే ఇటీవల నా 'ఊసులతీరం' బోసిపోయింది, బ్లాగరులకు కోపమొచ్చింది, మేటర్ సీరియస్ అయ్యింది, కేస్ స్టేషన్ వరకు వెళ్ళింది.
ఇంతకీ మెరీనా బీచ్ లో నేను కెమెరాలో బంధించిన ఆ అద్భుతం ఏమిటనుకుంటున్నారా?
 "ప్రాణం లేని విగ్రహం, ప్రాణం ఉన్న కాకి తెగ మాట్లాడేసుకుంటున్నాయ్". నమ్మకం లేదా? అయితే కింద వున్న ఫోటోలు చూడండి..
 
ఆవిడ ఏం చెబుతుంది..ఈవిడ ఏం వింటుంది?

3 comments:

  1. "మనిద్దరం ఒకే కలర్ - సేమ్ పించ్" అని అనుకుంటున్నాయేమో!

    ReplyDelete
  2. చెబుతున్నది కణ్ణగి కదా, కాకయినా నోరు మూసుకుని చెవులప్పగించి వినాల్సిందే :) బావుంది బొమ్మ.

    ReplyDelete