Saturday 19 November 2011

మొబైల్ గుసగుసలు

* ఈ పోస్ట్ ఉద్దేశ్యం SMS ల ద్వారా వచ్చిన సరదా విషయాలను పొందుపరచడమే తప్ప ఎవరిని బాధపెట్టాలని కాదు. .. !

'శ్రీరామరాజ్యం' సినిమాలోని డైలాగ్ ని బాలకృష్ణ  'సింహా' సినిమా టైప్ లో చెబితే ఎలావుంటుంది.
...రావణాసురుడితో -
"చూడు..నావైపే చూడు..సీతవైపు చూడకు..మసైపోతావ్"
---
"పోలీస్.. మారీచుడు మాయ లేడి రూపంలో మోసం చేసినప్పుడు నో పోలీస్,
రావణాసురుడు కపట సన్యాసి వేషంలో వచ్చినప్పుడు నో పోలీస్,
సీతాపహరణాన్ని అడ్డుకున్న జటాయువు రెక్కలు తెగ్గొట్టినప్పుడు నో పోలీస్,
అశోకవనంలో సీతాదేవిని రావణుడు బందించినప్పుడు నో పోలీస్,
హనుమంతుని తోకకు నిప్పెట్టినప్పుడు నో పోలీస్..వద్దు.. inspector నా దారికి అడ్డురావద్దు"
----
వెంగళప్ప : 'జంతికలమ్మా..జంతికలోయ్..'
వెర్రివెంగళ్ : అదేంటి నాన్నా జిలేబీలమ్ముతు జంతికలంటున్నావ్?
వెంగళప్ప : గట్టిగా అనకురా ఈగలు వింటే వచ్చేస్తాయి.

----
 భర్త : డియర్ ప్రియ! కొన్ని కారణాల వల్ల ఈ నెల సేలరీ పంపలేకపోతున్నాను. అందుకు బదులుగా 100 ముద్దులు పంపుతున్నాను తీసుకో..
వారం రోజుల తర్వాత..
భార్య: మీరు పంపిన ముద్దులలో 5 పాలవాడికి, 25 హౌస్ ఓనర్ కి, 5 పేపర్ బాయ్ కి, 5 టెలెఫోన్ వాడికి, 10 కిరాణావాడికి ఇచ్చాను. ఇంక వచ్చేనెలకు 50 వున్నాయి.

 ------
#  నేను SMS పంపితే మీరు  కూడా  SMS పంపాలని రూల్ లేదు. ఒక హోండాసిటి కార్, వాషింగ్ మేషిన్, ఫ్రిజ్..ఇలా ఏదైనా పంపొచ్చు.

3 comments:

  1. ముద్దుల గుసగుసలు , మిసమిసలు బాగా కుదిరింది. ఆ భర్త గారు, ఇక గరుడా వాహనం ఎక్కి వెంటనే ఇంటికి పయాణం కట్టి ఉంటాడనుకుంటా!

    ReplyDelete
  2. 'శ్రీరామరాజ్యం' సినిమాలోని డైలాగ్ ని బాలకృష్ణ 'సింహా' సినిమా
    టైప్ లో చెప్పటం చాలా బాగుంది..

    ReplyDelete
  3. @ జిలేబిగారూ! ఈరోజుల్లో ఆ గరుడవాహనాన్ని వెతుకుతూ కూర్చుంటే ఇంకా అనర్దంకదండి.
    @ రాజి గార్కి కృతజ్ఞతలు

    ReplyDelete