Tuesday 15 November 2011

ఔరా అనిపించే విషయాలు

1. మన శరీరంలో చర్మం అత్యంత పల్చగా వుండే ప్రదేశం కనురెప్పలు.
2. మనిషి లిపికంటే ముందు మ్యాపులు తయారుచేయడం నేర్చుకున్నాడట.
3. ఒక కిలో తేనెను  సేకరించడానికి పట్టులోని తేనెటీగలన్నీ కనీసం 40 లక్షల పూలమీద వాలతాయి.
4. జపాన్ బుల్లెట్ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 285 కి.మి. అయితే దీనికి పోటీగా చైనా రూపొందించిన 'హార్మోని' ట్రైన్ వేగం గంటకు 394 కి.మి.
5. ముద్దుపెట్టుకునేటప్పుడు ఎక్కువ మంది తమ తలను కుడివైపునకు వంచుతారట.
6.మనం మనస్పూర్తిగా నవ్వే 15 నిమిషాల నవ్వు 2 గంటల నిద్రతో సమానమట.
7. బంగ్లాదేశ్ జాతీయగీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్.
8. ఎంత ప్రయత్నించినా మన మోచేతిని మనం ముద్దాడలేము.
9. అతి తక్కువ జనాభా కలిగిన దేశం 'వాటికన్ సిటి' జనాభా 800 మంది.
10. మిగిలిన దేశాలతో పోలిస్తే మనదేశంలో 'ఆల్జీమర్' వ్యాదిగ్రస్తుల శాతం తక్కువగ వుండటానికి మనం వంటలలో వాడే 'కరివేపాకు' కూడా ఒక కారణమట.

* ఇవన్నీ వివిధ పత్రికలలో చదవడం ద్వారా తెలుసుకున్నవే.

5 comments:

  1. మంచి సేకరణ. మీరు అల్జిమర్స్ ప్రస్తావన తెచ్చారు కనుక ఒంకొక విషయం చెప్పడం సందర్భమనిపిస్తోంది. మన వంటలలో వాడే కరివేపాకు ఒక రెండు శాతం మాత్రమే రాకుండా చేయడానికి ప్రభావితం చేస్తుంది కాని ముఖ్యమయిన విషయం ఏమిటంటే ఏ మనిషయితే కనీసం రెండు సంబంధం లేని భాషలని అలవోకగా మాట్లాడగలడో అతనికి ఈ వ్యాధి వచ్చే సూచనలు చాలా తక్కువ.

    ReplyDelete
  2. and the last one is, after reading this majority ppl will try to lick their elbow.

    ReplyDelete
  3. @ రసజ్ఞగారు! తెలుగుతోపాటు ఏవైనా మరో రెండు మూడు భాషలు నేర్చుకోవాలని నాకూ ఎప్పట్నుంచో వుంది.వాటి వలన ఇలాంటి గొప్ప ప్రయోజనం వుందని మీద్వారా తెలుసుకున్నాను.
    @ జ్యోతిర్మయి గార్కి నా కృతజ్ఞతలు.
    @ సాధారణ పౌరుడు చెప్పినట్టు ఆ విషయం చదివిన వెంటనే నేను కూడా నా మోచేతిని ముద్దాడాలని ప్రయత్నించాను. కాని సాధ్యంకాలేదు.

    ReplyDelete
  4. మిగిలిన దేశాలతో పోలిస్తే మనదేశంలో 'ఆల్జీమర్' వ్యాదిగ్రస్తుల శాతం తక్కువగ వుండటానికి మనం వంటలలో వాడే 'కరివేపాకు' కూడా ఒక కారణమట.
    Interesting...
    రసజ్ఞగారు.. మంచి సమాచారం ఇచ్చారండి. థాంక్యూ.

    ReplyDelete