Sunday 13 November 2011

"దూకుడు" రికార్డ్స్ ని మించిన రికార్డ్

బ్లాగు చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. నాకు తెలిసి ఇప్పటి వరకు జరగనిది.. ఇక ముందు కూడా జరగని సెన్సేషనల్ రికార్డ్ ఇదే..ఇదే..ఇదే.. ఈ నా బ్లాగ్ రికార్డ్ ముందు మహేశ్ 'దూకుడు' రికార్డ్స్ ఏరకంగా చూసినా సరిపోవు. బ్లాగరుల్లో ఎవరికైనా 'గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్' వారితో పరిచయం వుంటే వెంటనే ఈ విషయం వారి చెవిలో వేసి నా బ్లాగ్ చరిత్రపుటల్లో వుండేలా మీ వంతు సాయం చేయండి.
అంతర్జాల వీక్షకులలో ఎవరికైనా మీడియా వారితో పరిచయం వుంటే వెంటనే 'పగిలిపోతున్న వార్త' రూపంలో టీవీ లలో వచ్చి ప్రపంచమంతా 'న్యూసై' కూసేలా చేయండి. ఇంకా ఇలా ఏఏ రూపాలలో ఈ సంచలన రికార్డ్ ని జనం ముందు వుంచాలో అన్ని రూపాలలో వుంచడానికి నా శ్రేయోభిలాషులందరు  తలో దిక్కుకు పరుగులు తీయండి.
'ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటారా..? అయ్యో ఇంతకీ నేను విషయం చెప్పకుండానే ఈ హడావిడి చేస్తున్నాన. క్షమించండి.. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..'నిన్ననే ప్రారంభించిన నా బ్లాగు... పట్టుమని పది టపాలు కూడా లేని నాబ్లాగు...ఉదయానికి కేవలం 23 హిట్స్ తో వున్న నా బ్లాగు.. ఇప్పుడు చూసేటప్పటికి నాలుగు లక్షల హిట్స్ దాటి ఐదు లక్షల వైపు పరుగులు పెడుతుంది. ఇంతకంటే గొప్ప రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, బ్లాగ్ ఆఫీస్ రికార్డ్ ఇంకేముంటుంది.ఋజువు కావాలంటే నాబ్లాగుకు ఎడమవైపున, పైభాగంలో వున్న హిట్ కౌంటర్ చూడండి.
"..ఈ దూకుడు..." అదిగో ఎవరో సందర్భానికి తగ్గ పాట ప్లే చేస్తున్నారు. "సాటెవ్వరు"...


గమనిక : ఇలాంటి వింత జరగడానికి కారణం ఏమయ్యుంటుందో తెలిస్తే చెప్పగలరు. కలికాలం అని మాత్రం తప్పించుకోకండి.

3 comments:

  1. ముందుగా మీకు అభినందనలు బాలు గారు!
    ఈ వింతకి కారణం నాకు తెలుసు కానీ చెప్పాక సర్లే వెళ్ళిరండి అనరు కదా! చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా! అదేమిటంటే మరి...... బోణి చేసిందెవరు? అదనమాట మేటరు! (lol)

    ReplyDelete
  2. @ రసజ్ఞగారు..మళ్ళీ టచ్ చేసారండి.ఇలాగే మీ బంగారుచేయి నాకు అచ్చిరావాలని కోరుకుంటాను.

    ReplyDelete
  3. ఏటి? నిజమే!!! :))
    పగిలిపోతున్న వార్త.. అనువాదం బాగుంది. :)

    ReplyDelete