Monday 28 November 2011

ఔరా అనిపించే విషయాలు-2

1. తలపై జుట్టు కాస్త పల్చగా ఉంటే అందులో వుండే వెంట్రుకల సంఖ్య 90 వేల లోపే వున్నట్టు.

2. బ్రెజిల్ లో తయారయ్యే ఒక రకం బీర్ పేరు 'బ్రహ్మ'.

3. మన ముక్కుని గట్టిగా పట్టుకుని కూనిరాగాలు తీయలేం.

4. తోకచుక్కలో తోకభాగం ఎప్పుడూ సూర్యుడు వున్న వైపే సూచిస్తుంది.

5. ఒక్క అమెరికాలోనే పెళ్ళి ఉంగరాల నిమిత్తం ఏడాదికి 17 టన్నులకు పైగా బంగారాన్ని వాడుతున్నారు.

6. సగటున రెండువందలకోట్ల మందిలో ఒకరు 116 ఏళ్ళకు మించి బతుకుతారు.సో..మీ చుట్టుపక్కల ఎవరైనా 116 సం. మించి బతికితే వారిని రెండువందలకోట్లమందిలో ఒక ప్రత్యేకవ్యక్తిగా అనుకోవాలి.

7. ఒక మొక్కజొన్న పొత్తులో సగటున 800 గింజలు ఉంటాయట.ఇది కొంచెం నాకు డౌట్ గానే వుంది. ఈసారి మొక్కజొన్న పొత్తు కొన్నపుడు ఒకసారి లెక్కపెట్టేస్తే సరి.

8. బొమ్మబొరుసు ఆడేటపుడు బొమ్మ పడే అవకాశాలే ఎక్కువ. బొమ్మవైపు నాణెం బరువు కొంచెం ఎక్కువగా వుండటమే అందుకు కారణం.

9. మనుషుల్లో వేలిముద్రల్లాగే సింహాల్లో ఏ రెండింటి మీసాల అమరిక ఒకేలా వుండదట.

10. ఒక మనిషి తన జీవితకాలంలో 18 కిలోలకు పైగా దుమ్మును పీల్చుకుంటాడు. కాలుష్య తీవ్రతను బట్టి మున్ముందు ఈ కిలోలు పెరగొచ్చు.

* ఇవన్నీ వివిధ పత్రికలలో చదవడం ద్వారా తెలుసుకున్నవే.

4 comments:

  1. మనుషుల్లో వేలిముద్రల్లాగే అని చదవగానే నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది. మనుషుల్లో వేలిముద్రల్లాగే కోలా అనే జంతువులలో కూడా వేలిముద్రలు ఉంటాయి.

    ReplyDelete
  2. ఔరా!
    మూడవది ప్రయత్నించి చూశాను. నిజమే. :)
    ఏడవది.. హమ్మో! కష్టపడి అన్ని గింజలు దవడలు అరిగిపోయేలాగ నమిలి తింటున్నామా! బాబోయ్. ఇకమీదట మానేయాలి. :)
    బాగుందండీ మీ సేకరణ.

    ReplyDelete
  3. @ రసఙ్ఞగారూ కొత్త విషయాన్ని తెలియజేసారు. ఔరా అనిపించే విషయాలు మరో టపాలో పెట్టేటప్పుడు మీరు చెప్పిన విషయాన్ని కూడా జతచేస్తాను.
    @ సుభగార్కి, శిశిరగార్కి కృతజ్ఞతలు.

    ReplyDelete