Monday 21 November 2011

ఐశ్వర్య కూతురు పేరు-పార్ట్1

'మా ముద్దుల పాపాయికి మంచి పేరు సూచించండి' అంటూ అభిషేక్ బచ్చన్ కోరారు. 'ఎ' అనే అక్షరంతో మొదలయ్యే పేరు కావాలట.అందుకోసం ఒలింపిక్స్ రేంజ్ లో కసరత్తు చేస్తే చివరకు రెండు పేర్లు 'ఐశ్వర్య కూతురుకి సరిపోతానంటే  నేనని'  పోటీపడుతున్నాయి. 

"ఎల్వ, ఎల్లెల్వ"... ఎలా వున్నాయండి పేర్లు. వెరైటీగా ఫీలయ్యారా?
మీరు సింపుల్ గా 'బాగుంది...బాగోలేదు' అనేస్తే నేను వాటికోసం పడ్డ కష్టానికి గుర్తింపేముంటుంది. అందుకే ఈ 'ఎల్వ, ఎల్లెల్వ' అనే పేర్లు ఎలా పుట్టాయో వివరిస్తాను.

మునుపటి రోజుల్లో పిల్లలకు పెట్టె పేర్లకు ఒక అర్ధమంటూ తప్పనిసరిగా వుండేది. 'పెంటయ్య' అనే పేరు పలకటానికి మనకే ఇబ్బందిగా వున్నా దాని వెనకాల కూడా ఒక పరమార్దం వుండేదట. క్లుప్తంగా వివరిస్తాను.

ఒక తల్లి పుట్టబోయె బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటే పుట్టిన బిడ్డలు పుట్టినట్టు పురిట్లోనే చనిపోతున్నారట. ఆఖరికి మళ్ళీ బిడ్డ పుట్టబోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆ బిడ్డ పై మునుపటిలా అతిగా ఆశలు పెట్టుకోకుండా 'ఈ బిడ్డ కూడా పుట్టలేదనుకుని పుట్టగానే తీస్కెళ్ళి పెంటమీద (చెత్తతో పేరుకుపోయిన గుట్ట)  పడెయ్యమన్నారట పెద్దలు'.అందరిలాగే వీడు బతకలేదనుకుందాం అని ఆ తల్లిదండ్రులు అలాగే చేసారట. విచిత్రంగా ఆ బిడ్డడు బతికాడు. అందరిలో ఒకటే ఆనందం.ఇన్ని దేవుళ్లకు మొక్కినా దక్కని బిడ్డ ఇప్పుడు దక్కడానికి ఆ పెంటే కారణం అనుకుని అతనికి 'పెంటయ్య' అని పేరు పెట్టారట.

ఇక ఇప్పటి పిల్లల పేర్లలో అర్దాలు వెతుక్కోవడం కంటే పెద్ద తప్పు మరోటి వుండదు. మొన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడకు ఒకామె ఐదు సంవత్సరాల తన కూతుర్ని తీసుకుని వచ్చింది. తల్లి వచ్చీరాని ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడే ప్రయత్నం చెయ్యడం లేదు. కాని ఆమె ఈ.గో జిల్లా (తూ.గో.జిల్లా) వాస్తవ్యురాలని ఇంగ్లీష్ లోంచి తొంగి చూస్తున్న స్లాంగ్ ఇట్టే చెప్పేస్తుంది.భోజనాల సమయంలో 'పిస్సీ' బట్టలమీద పడకుండా తిను అని బట్లర్ ఇంగ్లీష్ లో  అంది.

అది విన్న నేను ముద్ద మింగడం మానేసి మెడ పైకెత్తి చూసాను. 'పిస్సీనా'.. అప్రయత్నంగా బయటకు అనేసాను."అవునండి.. పాప పేరు పిస్సీ".. అంది. నాకు ఆ పదం వినగానే వేరే యేదో వాడుకలో వున్న అర్ధం స్పురించింది. అంతెందుకు 'అలా మొదలైంది' సినిమాలో టాయ్-లెట్ దగ్గర హీరో హీరోయిన్ తో చెప్పిన పదం ఏదో గుర్తొచ్చింది. నా ఆలోచనలకు ముగింపుగా "అమ్మా! సాంబారు చాలా బాగుంది.పిసుక్కుని తింటుంటే ఇంకా బాగుంది" - అని ఆ చిన్నారి ఎలాంటి అరమరికలు లేకుండా వాళ్ళమ్మకు అరుస్తూ చెబుతుంది."పిస్సీ" అంటే అర్ధం ఏమిటండీ అని అడుగుదామనుకునే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.తీరా అడిగాక "మీరు అలా మొదలైంది సినిమా చూడలేదా?" అని ఆ బంగారు తల్లి అడిగితే.

ఇందేంటిది ఎక్కడో ములిగి ఎక్కడో తేలాను. అసలు ఐశ్వర్య కూతురికి 'ఎల్వ, ఎల్లెల్వ' అనే పేర్లు పెట్టడం వెనకున్న అర్ధం, అసలు ఆ పేర్లు ఎలా పుట్టాయనేది చెప్పడం మానేసి ఎటో వెళ్ళిపోయాను.
బ్లాగరులు క్షమించండి.ఐశ్వర్య కూతురు పేరు సినిమాలా చెప్పాలనుకుంటే సీరియల్ అయ్యింది. సమయాభావం వలన 'ఎల్వ, ఎల్లెల్వ' పేరుకు వివరణ ఈ టపా లో ఇవ్వలేకపోతున్నాను. తదుపరి టపాలో సూటిగా విషయానికి వచ్చేస్తాను. ఈలోపు ఈ రెండింటిలో ఏ పేరు ఫైనల్ గా పెడితే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి.

10 comments:

  1. ఎల్వ, ఎల్లెల్వ.....సరదాకి మాత్రమేనండోయ్.. :):):)

    ReplyDelete
  2. చెబుదామనే అనుకున్నానండీ ..కానీ చెప్పను.
    మీరు మా తూ.గో.జీ వాళ్ళని చాలా మాటలనేసారు ' మాక్కోపం రాదేటండీ మరి ఆయ్..!'

    ReplyDelete
  3. బాలూ గారూ వివరణ కోసం వెయిటింగ్. త్వరగా ఇచ్చేయండి మరి...

    అదే చేత్తో వర్ద్ వెరిఫికేషన్ కూడా తీసేద్దురూ..వ్యాఖ్య పెట్టడానికి సులభంగా ఉంటుంది.

    ReplyDelete
  4. :) బాగున్నాయి ఆ అమ్మాయి పేరూ, మీరు చెప్పిన పేర్లూ.

    ReplyDelete
  5. @ సుభగార్కి, శిశిరగార్కి కృతజ్ఞతలు.
    @ 'అయ్ బాబోయ్ లలితగారు! ఏదో చూసిన సంగతి చెప్పానుగాని అందర్నీ అనేసానని ఇదైపోతే ఎలాగండీ'..సరదాగ మాత్రమే తీస్కోండి.
    @ జ్యోతిర్మయిగారు! పని ఒత్తిడి వలన ఈరోజు వివరణ ఇవ్వలేకపోతున్నాను.తప్పకుండా వెంటనే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పిన 'వర్డ్ వెరిఫికేషన్' గురించి నాకు అంతగా అవగాహనలేదు. కుదిరితే వివరించగలరు.

    ReplyDelete
  6. baluu dasg board lo kelli settings lo comments ki velite akkada show word verification for comments ani untundi..akkada no click chesi save cheyandi. comments pette vallaki word verification adagadu.

    ReplyDelete
  7. sorry dashboard dasg board kaadu..

    ReplyDelete
  8. @ సెట్టింగ్స్ మార్చబడింది. ఒక కొత్తవిషయాన్ని తెలియజేసినందుకు సుభగార్కి కృతజ్ఞతలు.

    ReplyDelete
  9. ఎట్టా? ఎట్టెట్టా? తూ.గో.జి వాళ్ళని ఎన్నెన్ని మాటలనేసినారో సూడండి! ఎకసక్కేలుగా ఉందా? (సరదాకి)
    ముందు మీరు వివరణ ఇచ్చాక ఆలోచిస్తాను అప్పటిదాకా ఆలోచించను అంటే చించను అంతే!

    ReplyDelete
  10. రసజ్ఞగారూ! పెద్దమనసుతో మాలాంటి వాళ్లను చూసిచూడనట్టు వదిలెయ్యాలి. రేపటి పోస్టులో వివరణ ఇచ్చేస్తున్నాను.ఇవేమి మీరు మనసులోపెట్టుకోకండి.

    ReplyDelete