Tuesday 22 May 2012

దోమా! నీకు అవసరమా ప్రేమ?

అనగనగా ఒక దోమ
దాని పక్క పోర్షన్ లో ఒక  అందమైన చీమ
చీమంటే దోమకు వల్లమాలిన ప్రేమ
దాని దృష్టిలో పడటానికి పడింది ఎంతో శ్రమ
ఎప్పటికైనా చీమ ప్రేమను పొందగలనని దానికి ధీమా
చీమ నుండి మాత్రం స్పందన లేదు సుమా.
చివరకు దోమ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆడింది డ్రామా

అది తెలిసి చలించిపోయింది చీమ
దాని ప్రేమకు ఐపోయింది ఖీమా
దోమతో అంది 'నువ్వే నా భామ'
ఆ ఆనందంతో గట్టిగా కుట్టింది దోమ
ఆ దెబ్బకు చీమకు మిగిలింది కోమా
ఇంక చీమ తిరిగొస్తుంది అనుకోవడం దాని భ్రమ.

6 comments:

  1. మరింక తిరిగిరాదు సుమా, ఎంత గొప్ప ప్రేమ

    ReplyDelete
  2. ha,ha,ha, hi,hi,hi.....
    bhagundandi mee prema.

    ReplyDelete
  3. ఊసుల తీరం బాలు గారు,

    ఆహా తెలుగు సినీ కవీంద్రులు 'చీమ కుట్టింది' అన్న పదజాలానికి సరి కొత్త అర్థం చెప్పినారు.

    మీరు దోమ కుట్టింది అన్న పదజాలానికి ఆద్యం పలికారు! ఆల్ 'ధీ' బెష్టు!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. @ కష్టేఫలి గారూ! కృతజ్ఞతలు.
    @ ద ట్రీ గారూ! 'ఊసులతీరం' బ్లాగుకు స్వాగతం. మీకు నచ్చినందుకు సంతోషం.
    @ జిలేబి గారూ! చాలా పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారండి. అమ్మో దీనిని నేను చాలా జాగ్రత్తగ కాపాడుకుంటాను.

    ReplyDelete
  5. బాలు గారు భలే దోమ కుట్టింది అనే భావం కి కథ-కవిత అల్లారు.
    బావుంది.
    ఇంకో చిన్న విషయం. చాలా రోజులుగా చెప్పాలనుకున్నాను.ఈ విషయం గమనించండి..35 పోస్ట్ లు ,4 ,50,236 .. తొమ్మిది నెలల కాలం ..అతిధి అలలు.. సరి చూసుకోండి ప్లీజ్!

    ReplyDelete
    Replies
    1. @ వనజవనమాలిగారూ!దోమ ప్రేమ మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!
      మీరడిగిన చిన్న విషయం గురించి.. అయ్యో! నిజానికి అదెలాజరిగిందో నాకు అర్ధంకాలేదండి.అది జరిగిన ఆ ఆశ్చర్యంలో ఈ టాపిక్ పై ఒక టపా కూడా రాసాను. కావాలంటే కింద వుండే లింక్ చూడండి. "కలిసొచ్చే కాలానికి రాసొచ్చే బ్లాగు క్రియేట్ అవుతుందన్నట్టు" అలా జరిగిపోయింది తప్ప ఇందులో "క్విడ్ ప్రో కో" లాంటి జగన్మాయలేమీ లేవండి బాబు! నన్ను నమ్మండి.

      http://oosulatheeram.blogspot.in/2011/11/blog-post_13.html

      Delete