Monday, 9 January 2012

ఔరా అనిపించే విషయాలు - 3

1. పిరమిడ్లు నిర్మించిన కొత్తలో పూర్తిగా తెల్లగా వుండేవి.

2. మధ్యయుగంలో జపాన్ వైద్యులు దంతాలను చేతితోనే పీకేసేవారు.


3. అధికశాతం పిల్లలు పొడుగులో తండ్రిని, బరువులో తల్లిని పోలి ఉంటారు.


4. మన పొట్టలో దాదాపు 3 కోట్లకు పైగా జీర్ణగ్రంథులున్నాయి.5. చాకొలెట్ బారులో సగటున 8 సూక్ష్మజీవుల అవశేషాలుంటాయనేది ఒక అధ్యయనం తేల్చిన విషయం.

6. ఏ పేరూ లేని పర్వతాలు, కొండలకు ప్రజలే తమకు నచ్చిన పేరు సూచించే వెసులుబాటు అమెరికాలో ఉందట. ఈ విషయం అమెరికాలో ఉండే బ్లాగరులకె తెలియాలి.


7. జున్నును 24 రకాల క్షీరదాల పాల నుంచి తయారుచేయవచ్చు.

8. మామూలుగా చూసినా తలకిందులుగా చూసినా ఒకేలా కనిపించే సంవత్సరం 1961. అలా కనిపించే సంవత్సరం 6009.


9. మట్టితో అప్పుడే చేసిన పచ్చి కుండని కాల్చడాన్ని 'ఫైరింగ్' అంటారు.


10. మన పాలపుంతలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ సూర్యుడికంటే 25 రెట్లు ఎక్కువ వెలుగునిస్తుందట.

4 comments:

  1. ఔరా! అనేసాగా! ఈ జున్ను విషయంలో ఆ క్షీరదాల వివరాలు తెలిస్తే పెట్టరూ! ట్రై చేస్తా అసలే జున్నంటే చాలా ఇష్టం.

    ReplyDelete
  2. @ kastephale, raf raafsun గారూ! కృతజ్ఞతలు.
    @ రసజ్ఞ గారూ! నాకు తెలిసినంత వరకు ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, ఒంటే పాలతో జున్ను తయారు చేస్తారు.మిగిలిన 20 లో కనీసం 10 రకాల జున్నుపాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.

    ReplyDelete