Showing posts with label ఔరా. Show all posts
Showing posts with label ఔరా. Show all posts

Sunday, 20 May 2012

ఔరా అనిపించే విషయాలు.

 ఔరా అనిపించే విషయాలు..           
                                       
1. 
జిరాఫీ రోజులో సగటున రెండు గంటలకు మించి నిద్రపోదు.

2. డాల్పిన్స్ లో కొన్నింటికి 250 వరకు దంతాలు వుంటాయట.

3. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం డైనోసార్ లలో పెద్దవి 80,000 కేజీల నుండి 1,00,000 కేజీల వరకు బరువు ఉండవచ్చట.

4. సీతాకోకచిలుకలలో మగ సీతాకోకచిలుకలు తమ ప్రేయసిని 8 కిలోమీటర్ల దూరం నుండి వాసన ద్వారా గుర్తించి చేరుకుంటాయి.

5. తల్లి పెంగ్విన్ తన పిల్లను కోల్పోయిన సందర్భాలలో వేరే పెంగ్విన్ ల పిల్లలను దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది. 

6. తుమ్ము వచ్చినపుడు మనం కళ్ళను తెరిచి వుంచడం అసాధ్యం.
7. మన కళ్ళకు 10 మిలియన్ల రంగులను గుర్తించగలిగే సామర్ధ్యం ఉంటుందట.

8. 'మోనార్క్' అంటే చక్రవర్తి లేదా శ్రేష్టుడు అని అర్ధం.

9. ఇప్పటివరకు వర్షం అంటూ కురవని పట్టణం ప్రపంచంలో ఒకటుంది. దాని పేరు "Calama". ఇది చిలీ లో వుంది.


 10. ఒక ఎలుకల జంట సంవత్సరంలో 15000 పిల్ల ఎలుకలకు జన్మనిస్తాయి.

Thursday, 23 February 2012

ప్రయాణం కాదు ప్రమాదం

ఒక మిత్రుడు పంపించిన ఫోటో ఇది. ఏదో రకంగా ప్రయాణం చేస్తున్నాం, గమ్యాన్ని చేరుకుంటున్నాం అని అనుకోవచ్చు గాని ప్రమాదాలనేవి చెప్పిరావు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదైనా అనుకోని కారణాల వలన పట్టు తప్పితే పరిస్తితి ఏంటో ఆలోచించండి. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలకు ఎక్కువశాతం మనమే కారణం అని ఇలాంటివి చూస్తే ఇట్టే చెప్పొచ్చు.
ప్రైవేటు ఆటోల్లో లెక్కకు మించి ప్రయాణికులను చేరవేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు, చలానాలు రాస్తారు. మరి ప్రభుత్వ రవాణాలో జరిగే ఇలాంటి వాటిని ఎవరు అదుపుచెయ్యాలి?

Monday, 9 January 2012

ఔరా అనిపించే విషయాలు - 3

1. పిరమిడ్లు నిర్మించిన కొత్తలో పూర్తిగా తెల్లగా వుండేవి.

2. మధ్యయుగంలో జపాన్ వైద్యులు దంతాలను చేతితోనే పీకేసేవారు.


3. అధికశాతం పిల్లలు పొడుగులో తండ్రిని, బరువులో తల్లిని పోలి ఉంటారు.


4. మన పొట్టలో దాదాపు 3 కోట్లకు పైగా జీర్ణగ్రంథులున్నాయి.



5. చాకొలెట్ బారులో సగటున 8 సూక్ష్మజీవుల అవశేషాలుంటాయనేది ఒక అధ్యయనం తేల్చిన విషయం.

6. ఏ పేరూ లేని పర్వతాలు, కొండలకు ప్రజలే తమకు నచ్చిన పేరు సూచించే వెసులుబాటు అమెరికాలో ఉందట. ఈ విషయం అమెరికాలో ఉండే బ్లాగరులకె తెలియాలి.


7. జున్నును 24 రకాల క్షీరదాల పాల నుంచి తయారుచేయవచ్చు.

8. మామూలుగా చూసినా తలకిందులుగా చూసినా ఒకేలా కనిపించే సంవత్సరం 1961. అలా కనిపించే సంవత్సరం 6009.


9. మట్టితో అప్పుడే చేసిన పచ్చి కుండని కాల్చడాన్ని 'ఫైరింగ్' అంటారు.


10. మన పాలపుంతలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ సూర్యుడికంటే 25 రెట్లు ఎక్కువ వెలుగునిస్తుందట.

Monday, 28 November 2011

ఔరా అనిపించే విషయాలు-2

1. తలపై జుట్టు కాస్త పల్చగా ఉంటే అందులో వుండే వెంట్రుకల సంఖ్య 90 వేల లోపే వున్నట్టు.

2. బ్రెజిల్ లో తయారయ్యే ఒక రకం బీర్ పేరు 'బ్రహ్మ'.

3. మన ముక్కుని గట్టిగా పట్టుకుని కూనిరాగాలు తీయలేం.

4. తోకచుక్కలో తోకభాగం ఎప్పుడూ సూర్యుడు వున్న వైపే సూచిస్తుంది.

5. ఒక్క అమెరికాలోనే పెళ్ళి ఉంగరాల నిమిత్తం ఏడాదికి 17 టన్నులకు పైగా బంగారాన్ని వాడుతున్నారు.

6. సగటున రెండువందలకోట్ల మందిలో ఒకరు 116 ఏళ్ళకు మించి బతుకుతారు.సో..మీ చుట్టుపక్కల ఎవరైనా 116 సం. మించి బతికితే వారిని రెండువందలకోట్లమందిలో ఒక ప్రత్యేకవ్యక్తిగా అనుకోవాలి.

7. ఒక మొక్కజొన్న పొత్తులో సగటున 800 గింజలు ఉంటాయట.ఇది కొంచెం నాకు డౌట్ గానే వుంది. ఈసారి మొక్కజొన్న పొత్తు కొన్నపుడు ఒకసారి లెక్కపెట్టేస్తే సరి.

8. బొమ్మబొరుసు ఆడేటపుడు బొమ్మ పడే అవకాశాలే ఎక్కువ. బొమ్మవైపు నాణెం బరువు కొంచెం ఎక్కువగా వుండటమే అందుకు కారణం.

9. మనుషుల్లో వేలిముద్రల్లాగే సింహాల్లో ఏ రెండింటి మీసాల అమరిక ఒకేలా వుండదట.

10. ఒక మనిషి తన జీవితకాలంలో 18 కిలోలకు పైగా దుమ్మును పీల్చుకుంటాడు. కాలుష్య తీవ్రతను బట్టి మున్ముందు ఈ కిలోలు పెరగొచ్చు.

* ఇవన్నీ వివిధ పత్రికలలో చదవడం ద్వారా తెలుసుకున్నవే.

Tuesday, 15 November 2011

ఔరా అనిపించే విషయాలు

1. మన శరీరంలో చర్మం అత్యంత పల్చగా వుండే ప్రదేశం కనురెప్పలు.
2. మనిషి లిపికంటే ముందు మ్యాపులు తయారుచేయడం నేర్చుకున్నాడట.
3. ఒక కిలో తేనెను  సేకరించడానికి పట్టులోని తేనెటీగలన్నీ కనీసం 40 లక్షల పూలమీద వాలతాయి.
4. జపాన్ బుల్లెట్ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 285 కి.మి. అయితే దీనికి పోటీగా చైనా రూపొందించిన 'హార్మోని' ట్రైన్ వేగం గంటకు 394 కి.మి.
5. ముద్దుపెట్టుకునేటప్పుడు ఎక్కువ మంది తమ తలను కుడివైపునకు వంచుతారట.
6.మనం మనస్పూర్తిగా నవ్వే 15 నిమిషాల నవ్వు 2 గంటల నిద్రతో సమానమట.
7. బంగ్లాదేశ్ జాతీయగీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్.
8. ఎంత ప్రయత్నించినా మన మోచేతిని మనం ముద్దాడలేము.
9. అతి తక్కువ జనాభా కలిగిన దేశం 'వాటికన్ సిటి' జనాభా 800 మంది.
10. మిగిలిన దేశాలతో పోలిస్తే మనదేశంలో 'ఆల్జీమర్' వ్యాదిగ్రస్తుల శాతం తక్కువగ వుండటానికి మనం వంటలలో వాడే 'కరివేపాకు' కూడా ఒక కారణమట.

* ఇవన్నీ వివిధ పత్రికలలో చదవడం ద్వారా తెలుసుకున్నవే.