Thursday 2 August 2012

నల్లని మేఘం కూడా నల్లధనంలా అయిపోయింది


ఆకాశానికి దాహం ఎక్కువ
సూర్యకిరణాలను స్ట్రాలు గా చేసి
నేలపై నీటిని అందినకాడికి తాగేసింది.

ఆకాశం తాను తాగిన నీటిని మేఘంలో దాచిపెట్టింది
మేఘం స్విస్ బ్యాంక్ అవతారమెత్తింది
అది మనల్ని ఊరిస్తుందికాని ఊడి చుక్క పడనివ్వదు.

నల్లని మేఘం కూడా నల్లధనంలా అయిపోయింది.

7 comments:

  1. నిజమేనండీ మంచి విషయం చెప్పారు :)

    ReplyDelete
  2. కస్టేఫలేగారూ, రాజీగారూ! మీ స్పందనలకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. నల్లని మేఘం కూడా నల్లధనం... ఏం చెప్పారండీ(ఏం చెప్పారూ అని అడగట్లేదు..గమనించాలి):)మీ ప్రాక్టికల్ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను బాలూ గారూ..

    ReplyDelete
  4. సుభగారూ! చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. కృతజ్ఞతలండి.

    ReplyDelete
  5. హాయ్ బాలూ!
    విదేశాల కెళ్ళిన నల్లధనం మన దాకా వచ్చేలోగా కరిగిపొతుంది.. కాలం.

    గుడ్ మై ఫ్రెండ్.

    ReplyDelete
  6. "విదేశాల కెళ్ళిన నల్లధనం మన దాకా వచ్చేలోగా కరిగిపొతుంది"..మీ వర్ణన కూడా బాగుందండి.

    ReplyDelete